రూ.1.51 కోట్లతో సీసీ రోడ్లు
ABN , Publish Date - Jun 23 , 2026 | 04:53 AM
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో సీసీ రోడ్ల నిర్మాణం, ఆధునికీకరణ పనులకు మున్సిపల్ అధికారులు చర్య లు చేపట్టారు. రూ.1.51 కోట్ల పనులకు టెండర్లను ఆహ్వానించారు.
టెండర్లు పిలిచిన రాయదుర్గం మున్సిపల్ అధికారులు
‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’లో హామీలకు కార్యరూపం
రాయదుర్గం, జూన్ 22(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో సీసీ రోడ్ల నిర్మాణం, ఆధునికీకరణ పనులకు మున్సిపల్ అధికారులు చర్య లు చేపట్టారు. రూ.1.51 కోట్ల పనులకు టెండర్లను ఆహ్వానించారు. ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో మార్చి 24న నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమంలో.. గుంతలమయమైన అంతర్గత రోడ్లను బాగు చేయాలని, మట్టిరోడ్లు ఉన్నచోట సీసీ రోడ్లు వేయాలని ప్రజలు విన్నవించారు. విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అప్పటికప్పుడు నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. పనులు చేపట్టాల్సిన రోడ్లను అధికారులు గుర్తించారు. 41 పనులకు ఏపీయూ ఎఫ్‌ఐడీసీ పథకం కింద నిధులు కేటాయించారు. టెండరు ప్రక్రియ పూర్తికాగానే పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.