Share News

చంద్రబాబు విజన్‌తోనే ఎన్‌ఫీల్డ్‌ రాక: ఎమ్మెల్యే రాజు

ABN , Publish Date - May 12 , 2026 | 05:10 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌తోనే రాయలసీమకు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వచ్చిందని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు.రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ రాకను స్వాగతిస్తూ శ్రీసత్యసాయి జిల్లా...

చంద్రబాబు విజన్‌తోనే ఎన్‌ఫీల్డ్‌ రాక: ఎమ్మెల్యే రాజు

  • మడకశిరలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ ర్యాలీ

మడకశిర టౌన్‌, మే 11(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌తోనే రాయలసీమకు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వచ్చిందని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు.రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ రాకను స్వాగతిస్తూ శ్రీసత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో ఆ కంపెనీ బైక్‌లతో సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లా సత్యవేడులో రూ.2200 కోట్లతో ఏర్పాటయ్యే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ పరిశ్రమ ద్వారా ఐదు వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. చంద్రబాబు విజన్‌తో రాయలసీమ యువతకు బంగారు భవిష్యత్తు వస్తోందని తెలిపారు.

Updated Date - May 12 , 2026 | 05:10 AM