పటిష్ట ఏర్పాట్లు
ABN , Publish Date - Nov 04 , 2026 | 11:59 PM
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహ ణకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్, ఎన్నికల అధికారి ఏ.సిరి తెలిపారు.
26 జడ్పీటీసీ, 358 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
జిల్లాలో మొత్తం 12,50,166 మంది ఓటర్లు
కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏ.సిరి
కర్నూలు కలెక్టరేట్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహ ణకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్, ఎన్నికల అధికారి ఏ.సిరి తెలిపారు. జిల్లాలో మొత్తం 432 ఎంపీటీసీ స్థానాలకు గానూ 74 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 358 ఎంపీటీసీ స్థానాలకలుల పోలింగ్ జరగనున్నాయి. 26జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుందన్నారు. జడ్పీటీసీ స్థానాలకు 97 మంది, ఎంపీటీసీ స్థానాలకు 907 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు. జిల్లాలో మొత్తం 12,50,166 మంది గ్రామీణ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారన్నారు. వీరిలో 6,21,167 మంది పురుషులు, 6,28,834 మంది మహిళలు, 165 మంది ఇతరులు ఉన్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా 648 ప్రాంతాల్లో మొత్తం 1,432 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత, ర్యాంపులు తదితర కనీస ప్రాథమిక సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటిలో 299 అతి సున్నితమైన పోలింగ్ కేంద్రాలు, 398 సున్నితమైన పోలింగ్ కేంద్రాలు, 735 సాధారణ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా పర్యవేక్షించేందుకు 697 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, 735 పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీ ఏర్పాటు చేశారన్నారు. సున్నితమైన, అతి సున్నితమైన ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించేందుకు 255 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో జరిగే ఓటింగ్ ప్రక్రియను సీసీ కెమెరాల ద్వారా తాను, ఎన్నికల సంఘం పర్యవేక్షించనుందన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 1,575 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,578 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు 5,128 మంది ఇతర పోలింగ్ అధికారులు కలిపి మొత్తం 8,281 మంది పోలింగ్ సిబ్బందిని నియమించామన్నారు.