Share News

వర్షం కోసం జలాభిషేకం

ABN , Publish Date - Jul 14 , 2026 | 12:21 AM

వరుణ దేవుడు కరుణ చూపాలంటూ ఆ దోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల పరిధిలోని వివిధ గ్రామా ల్లో రైతన్నలు, ప్రజలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.

వర్షం కోసం జలాభిషేకం
ఆస్పరి: శివలింగానికి జలాభిషేకం చేస్తున్న గ్రామస్థులు

ఆదోని అగ్రికల్చర్‌/తుగ్గులి/మద్దికెర,ఆస్పరి/ఆలూరు, జూలై 13(ఆంధ్రజ్యోతి) : వరుణ దేవుడు కరుణ చూపాలంటూ ఆ దోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల పరిధిలోని వివిధ గ్రామా ల్లో రైతన్నలు, ప్రజలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. యువకులు గ్రామ దేవుళ్లకు నీటి బిందెలతో జలాభిషేకం చేపట్టారు. ఆదోనిలో మార్కెట్‌ యార్డ్‌లో చైర్‌పర్సన జిందే శారద ఆధ్వర్యంలో శివాలయంలో 101 బిందెతో జలాభిషేకం చేశారు. అలాగే ఆయా గ్రామాల్లో బోడ్రాళ్లకు, ధ్వజస్తంభాలకు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే పాటలు పాడుతూ కప్పలను ఊరేగించారు.

Updated Date - Jul 14 , 2026 | 12:22 AM