పెరుగుతున్న ఎండలు.. నందిగామలో 33.6 డిగ్రీలు
ABN , Publish Date - Jan 27 , 2026 | 04:23 AM
కోస్తా, రాయలసీమల్లో రెండు రోజులుగా ఎండ తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి.
విశాఖపట్నం, జనవరి 26(ఆంధ్రజ్యోతి): కోస్తా, రాయలసీమల్లో రెండు రోజులుగా ఎండ తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. సోమవారం నందిగామలో 33.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీలో మాత్రం చలి ప్రభావం కొనసాగుతోంది. ఉత్తరకోస్తాలోని పలు జిల్లాల్లో పొగమంచు కురిసింది. రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి.