Share News

పెరిగిన పత్తి ధరలు

ABN , Publish Date - Sep 16 , 2026 | 11:25 PM

ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో పత్తిధర భారీగా పెరిగింది.

   పెరిగిన పత్తి ధరలు
విక్రయానికి వచ్చిన పత్తి దిగుబడులు

క్వింటా రూ.10,100

ఆదోని అగ్రికల్చర్‌ , సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి) : ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో పత్తిధర భారీగా పెరిగింది. బుధవారం పత్తి క్వింటా గరిష్ఠం రూ.10,100 పలికింది. ఖరీఫ్‌లో ముందస్తుగా సాగు చేసిన పత్తి చేతికందడంతో విక్రయానికి తెస్తున్నారు. పత్తికి ధర భారీగా పలుకు తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 15 రోజులతో పోల్చితే క్వింటానికి రూ.1,300 పైగా ధరలు పెరిగాయి. 6,432 క్వింటాలు విక్రయానికి రాగా వాటి కనిష్ఠ ధర రూ.5,000, మధ్యస్థం రూ.9,750, గరిష్ఠం రూ. 10,100 పలికింది.

Updated Date - Sep 16 , 2026 | 11:25 PM