Share News

గేట్‌ ఫలితాల్లో ఆర్జీయూకేటీ విద్యార్థుల సత్తా

ABN , Publish Date - Mar 22 , 2026 | 04:37 AM

గేట్‌ ఫలితాల్లో రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేటీ) విద్యార్థులు సత్తా చాటారు.

గేట్‌ ఫలితాల్లో ఆర్జీయూకేటీ విద్యార్థుల సత్తా

110 మంది విద్యార్థులకు 1500లోపు ర్యాంకులు

అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): గేట్‌ ఫలితాల్లో రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేటీ) విద్యార్థులు సత్తా చాటారు. 110 మంది 1500లోపు ర్యాంకులు సాధించారు. వీరిలో ఎక్కువ మందికి ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ఆర్జీయూకేటీ వర్గాలు తెలిపాయి. 300కు పైగా విద్యార్థులకు ఐఐటీల్లో పీజీ అడ్మిషన్లు వస్తాయన్నారు. ఆలిండియా స్థాయిలో ఆర్కే వ్యాలీ క్యాంప్‌స విద్యార్థులు షేక్‌ మునీర్‌ 5, పసుపులేటి రవితేజ 8, కండ్ర సార్విక 22, చేతన్‌ వరుణ్‌ 53, కప్పల అభిషేక్‌ 84 ర్యాంకులు సాధించారు. శ్రీకాకుళం క్యాంపస్‌ విద్యార్థులు సాయి గణేష్‌ గొండు 31, ఇంటూరు ఉమే్‌షచంద్ర 77 ర్యాంకులు సాధించారు. నూజివీడు క్యాంపస్‌ విద్యార్థులు వీఎస్ఎం శేష సురేశ్‌ 37, మనోజ్‌కుమార్‌ 43, ఎ.తిలక్‌దేవి ప్రశాంత్‌ 54 ర్యాంకులు సాధించారు. ఒంగోలు క్యాంపస్‌ విద్యార్థులు టి.విజ్ఞాన్‌ 153, ఎస్‌.దుర్గాప్రసాద్‌ 166 ర్యాంకులు సాధించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆర్జీయూకేటీ ఇన్‌చార్జ్‌ చాన్స్‌లర్‌ కె.మధుమూర్తి అభినందించారు.

Updated Date - Mar 22 , 2026 | 04:37 AM