జగన్‌రెడ్డిది దుర్మార్గ వైఖరి: మంత్రి అనగాని
ABN , Publish Date - Apr 03 , 2026 | 06:02 AM
అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించడం తెలుగు జాతి చరిత్రలో మహోన్నతమైన ఘట్టంగా నిలుస్తుందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు...
రేపల్ల్లె, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించడం తెలుగు జాతి చరిత్రలో మహోన్నతమైన ఘట్టంగా నిలుస్తుందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ‘దేశంలోని అన్ని రాజకీయపార్టీలు అమరావతికి అండగా నిలబడగా, దానిని వ్యతిరేకించిన వైసీపీ నాయకులు చరిత్రహీనులుగా నిలిచారు. ఇప్పటికైనా జగన్‌రెడ్డి కుయుక్తులతో కూడిన రాజకీయాలను మానుకోవాలి’ అన్నారు.