Share News

రిటైర్డ్‌ ఎస్‌ఈ లాకర్‌లో 1.7 కిలోల బంగారం!

ABN , Publish Date - Feb 08 , 2026 | 04:56 AM

పంచాయతీరాజ్‌ శాఖ రిటైర్డ్‌ ఎస్‌ఈ కళ్లేపల్లి శ్రీనివాసరావుకు సంబంధించిన మరిన్ని ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు.

రిటైర్డ్‌ ఎస్‌ఈ లాకర్‌లో 1.7 కిలోల బంగారం!

  • కళ్లేపల్లి శ్రీనివాసరావు బ్యాంకు లాకర్‌ను తెరిపించిన ఏసీబీ

విశాఖపట్నం, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్‌ శాఖ రిటైర్డ్‌ ఎస్‌ఈ కళ్లేపల్లి శ్రీనివాసరావుకు సంబంధించిన మరిన్ని ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. శ్రీనివాసరావుతోపాటు ఆయన బంధువులు, స్నేహితులకు చెందిన నివాసాల్లో ఈనెల 5న ఏసీబీ సోదాలు నిర్వహించి సుమారు రూ.3 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించిన విషయం తెలిసిందే. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నందున శ్రీనివాసరావును అరెస్టు చేసి శుక్రవారం కోర్టులో హాజరుపరచగా ఈనెల 20వ తేదీ వరకు రిమాండ్‌ విధించింది. తాజాగా శ్రీనివాసరావుతోపాటు ఆయన భార్య పేరిట ఎంవీవీ సిటీలోని ఐసీఐసీఐ బ్యాంకులో ఉన్న లాకర్‌ను ఏసీబీ అధికారులు శనివారం తెరిపించారు. అందులో మూడు వడ్డాణాలు, ఒక హారం సహా 1.737 కిలోల బరువు కలిగిన 28 ఆభరణాలు లభ్యమయ్యాయి.

Updated Date - Feb 08 , 2026 | 04:58 AM