Share News

మా నాన్న రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఆపొద్దు

ABN , Publish Date - Jul 01 , 2026 | 06:18 AM

మా నాన్నకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలను ఆపొద్దంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌ కుమారులు లేఖ రాశారు.

మా నాన్న రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఆపొద్దు

  • సీఎస్‌కు రిటైర్డ్‌ ఐపీఎస్‌ పీవీ సునీల్‌ కుమారుల లేఖ

అమరావతి, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): మా నాన్నకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలను ఆపొద్దంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌ కుమారులు లేఖ రాశారు. సునీల్‌కుమార్‌తో దూరంగా ఉంటున్న ఆయన భార్య అరుణ తన భర్త రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఆపాలంటూ ఇటీవల ప్రభుత్వానికి విన్నవించారు. ఈ నేపథ్యంలో సునీల్‌ కుమారులు రోహిత్‌ శౌర్య, హర్షల్‌ తన తండ్రికి దక్కాల్సిన ప్రయోజనాలు ఆపొద్దంటూ సీఎస్‌కు లేఖ రాశారు. తమ తల్లి చేసిన అభ్యర్థన చట్టపరంగా నిలబడదని లేఖలో పేర్కొన్నారు. 2014నుంచి తమ తల్లిదండ్రులు కలిసి లేరని, కేసు విజయవాడ కోర్టులో విచారణలో ఉందన్నారు. కాగా, జూన్‌ 30న పదవీ విరమణ చేసిన సునీల్‌కుమార్‌కు సర్వీసు ప్రయోజనాలు... ఆయనపై ఉన్న ఆరోపణలపై వచ్చే తీర్పులు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు విడుదల చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Updated Date - Jul 01 , 2026 | 06:19 AM