సైబర్ నేరగాళ్ల వలలో విశ్రాంత ఉద్యోగి
ABN , Publish Date - May 08 , 2026 | 11:33 PM
సైబర్ నేరగాళ్లు ఓ విశ్రాంత బ్యాంక్ ఉద్యోగిని బెదిరించి రూ.లక్షలు స్వాహా చేశారు. ఈఘటన నంద్యాల పట్టణంలో చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులమని చెప్పి రూ.29లక్షలు స్వాహా
నంద్యాల క్రైమ్, మే 08 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరగాళ్లు ఓ విశ్రాంత బ్యాంక్ ఉద్యోగిని బెదిరించి రూ.లక్షలు స్వాహా చేశారు. ఈఘటన నంద్యాల పట్టణంలో చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన జిల్లాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. బాధితుడు, పోలీసులు సమాచారం మేరకు.. పట్టణంలోని ఎస్‌బీఐ కాలనీకి చెందిన వేముల సుబ్రమణ్యంశెట్టి ఓ బ్యాం కులో పనిచేసి పదవీ విరమణ పొందారు. ఇటీవల బెంగళూరులోని అశోక్ నగర్ పోలీసుస్టేషనలో పనిచేస్తున్నానని, తనపేరు శివప్రసాద్ అంటూ ఓ వ్యక్తి ఫోన చేశారు. మహిళలను వేధించడంతో పాటు అశ్లీల చిత్రాలు అప్‌లోడ్ చేస్తున్నావంటూ సుబ్రమణ్యం శెట్టిని బెదిరించారు. మరుసటి రోజు సీబీఐ అధికారినంటూ దయాకర్ అనే వ్యక్తి నుంచి ఫోన కాల్ వచ్చింది. అంతర్జాతీయ డ్రగ్ సుధాకత అలీఖానతో సంబంధాలున్నట్లు తమకు తెలిసిందని, కేసు నమోదుచేసి డిజిటల్ అరెస్ట్‌చేసి విచారించాల్సి ఉంటుందని చెప్పడంతో ఆందోళనకు గురయ్యారు. భయపడిన సుబ్ర మణ్యంశెట్టి తనకు ఎవరితో ఎలాంటి సంబంధాలు లేవని, తనకు ఏపాపం తెలి యదని ప్రాధేయపడినా ఫలితం లేకపోవడంతో భయపడ్డారు. కేసులు, విచారణ లేకుండా చేయాలంటే తమకు రూ.30లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో తప్పని పరిస్థితుల్లో డిమాండ్లకు అంగీకరించి రూ. 29లక్షలు వారికి జమచేశాడు. అనంతరం వారు సుబ్రమణ్యం శెట్టికి ఫోనచేసి దగ్గరలోని పోలీసుస్టేషనకు వెళ్లి సీఐతో మా ట్లాడించాలని చెప్పడంతో హుటాహుటిన టూ టౌన పోలీసుస్టేషనకు వెళ్లాడు. సుబ్ర మణ్యం శెట్టి సీఐతో మాట్లాడించడానికి ప్రయత్నించినప్పటికీ సైబర్ నేరగాళ్లు చేసిన ఫోన స్విచాఫ్ కావడంతో మోసం జరిగిందని గ్రహించాడు. విషయం అర్థం చేసుకున్న సీఐ అస్రార్‌బాషా మోసాన్ని గ్రహించి ఫిర్యాదు ఇవ్వాలని చెప్పారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.