Share News

పి.గన్నవరం డ్రైనేజీ వ్యవస్థపై నివేదిక కోరాం: మనోహర్‌

ABN , Publish Date - Feb 27 , 2026 | 04:53 AM

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల మంత్రి మనోహర్‌ తెలిపారు.

పి.గన్నవరం డ్రైనేజీ వ్యవస్థపై నివేదిక కోరాం: మనోహర్‌

అమరావతి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల మంత్రి మనోహర్‌ తెలిపారు. గురువారం అసెంబ్లీలో పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తరఫున మనోహర్‌ బదులిచ్చారు. తన నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంపై నివేదిక కోరామని, మొత్తం 68 గ్రామ పంచాయతీల్లో 21 పంచాయతీల్లో డ్రైనేజీ పాక్షికంగా మూసుకుపోయినట్లు గుర్తించామని మంత్రి తెలిపారు.

Updated Date - Feb 27 , 2026 | 04:54 AM