వైభవంగా రేణుకాచార్య జయంతి
ABN , Publish Date - Mar 03 , 2026 | 11:36 PM
పట్టణంలో ఆది జగద్గురు రేణు కాచార్యుల 18వ వార్షిక జయంత్యుత్సవాన్ని మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఆదోని, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో ఆది జగద్గురు రేణు కాచార్యుల 18వ వార్షిక జయంత్యుత్సవాన్ని మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఏపీ వీరశైవ లింగాయత్, లింగ బలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వాసునూరి చంద్రశేఖర్ కొటాల, కార్పొరేషన్ చైర్‌పర్సన్ , తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తులజాపూర్ స్వప్న హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ జంగమ వీరశైవ హక్కల పోరాట సమితి నాయకులు వారికి ఘనంగా స్వాగతం పలికి శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. అనంతరం జంగమ వీరశైవ హక్కుల పోరాట సమితి నాయకులు కార్పొరేషన చైర్మన్లకు తమ సమస్యలపై వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో జంగమ వీరశైవులు అధిక సంఖ్యలో ఉన్నారని, దేవాలయాల్లో అర్చకులుగా పనిచేసేందుకు జంగమ వీరశైవులకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. కార్యక్రమంలో జంగమ వీరశైవ నాయకులు ఎం.డి.నటరాజ్‌స్వామి, గాజుల చంద్ర, కన్నె జగదీష్, ఎడవల్లి మంజు, సిద్ధప్ప, ప్రభుస్వామి, ఎండీ సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.