ఏపీలో విలీనమైన5 పంచాయతీలను సాధిస్తాం
ABN , Publish Date - Apr 14 , 2026 | 05:34 AM
ఏపిలో విలీనమైన ఐదు పోలవరం ముంపు పంచాయతీలను రాజ్యాంగబద్ధంగా సాధించి తీరుతామని ప్రమాణం చేసి చెబుతున్నానని..
దీనిపై ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తా: రేణుకాచౌదరి
భద్రాచలం, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): ఏపిలో విలీనమైన ఐదు పోలవరం ముంపు పంచాయతీలను రాజ్యాంగబద్ధంగా సాధించి తీరుతామని ప్రమాణం చేసి చెబుతున్నానని.. తన కంఠంలో ప్రాణమున్నంత వరకూ వాటిని సాధించేందుకు పోరాడుతానని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం భద్రాచలంలో జరిగిన భద్రాద్రి పునరేకీకరణ విస్తృత స్థాయి అఖిలపక్ష సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఐదు పంచాయతీలనూ తెలంగాణలోని భద్రాచలంలో విలీనం చేసేందుకు సహకరించాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తానని పేర్కొన్నారు.