సాహితీవేత్త గడ్డం సుశీల మృతి
ABN , Publish Date - Jul 04 , 2026 | 04:40 AM
సాహితీవేత్త, విశ్రాంత ఆచార్యులు గడ్డం(మిక్కిలినేని) సుశీల(86) శుక్రవారం మృతి చెందారు.
రామచంద్రపురం(ద్రాక్షారామ), జూలై 3 (ఆంధ్రజ్యోతి): సాహితీవేత్త, విశ్రాంత ఆచార్యులు గడ్డం(మిక్కిలినేని) సుశీల(86) శుక్రవారం మృతి చెందారు. ఆమె డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కుమార్తె డాక్టర్ కవితతో ఉంటున్నారు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ సంపాదక సభ్యురాలిగా పనిచేసిన ఆమె... ఆ సంస్థకు ఎడిటర్‌గా ఉన్న భర్త గడ్డం కోటేశ్వరరావుతో కలసి అనేక రచనల్లో సహాయపడ్డారు. తండ్రి మిక్కిలినేని అక్కయ్య చౌదరికి మార్క్స్ క్యాపిటల్ తెలుగు అనువాదంలో, టాల్‌స్టాయ్ జీవిత చరిత్ర రచనల్లోనూ సహకరించారు. ఆమె రాసిన పలు కథలు, పుస్తకసమీక్షలు విశాలాంధ్ర దినపత్రికలో ప్రచురితమయ్యాయి. శనివారం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.