Share News

ప్రముఖ పద్యకవి ‘చదలవాడ’ ఇకలేరు

ABN , Publish Date - Apr 13 , 2026 | 05:50 AM

ప్రముఖ పద్యకవి చదలవాడ లక్ష్మీనరసింహారావు(90) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్వగృహంలో...

ప్రముఖ పద్యకవి ‘చదలవాడ’ ఇకలేరు

ఒంగోలు కల్చరల్‌, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): ప్రముఖ పద్యకవి చదలవాడ లక్ష్మీనరసింహారావు(90) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్వగృహంలో ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఉపాధ్యాయునిగా మూడున్నర దశాబ్దాల పాటు సంతనూతలపాడు పరిసర ప్రాంతాల్లో పనిచేసిన ఆయన నిబద్ధత కలిగిన టీచర్‌గా పేరు తెచ్చుకున్నారు. పద్య కవిగా నాలుగు దశాబ్దాల నుంచి సాహిత్య సేవ కొనసాగిస్తున్నారు. పద్యసాహిత్యంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా ఆయనకు ‘పద్యభారతి’ బిరుదు లభించింది. నరసింహారావు అంత్యక్రియలు సోమవారం నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.

Updated Date - Apr 13 , 2026 | 05:51 AM