కేసీకి నీరు విడుదల చేయండి
ABN , Publish Date - Jan 21 , 2026 | 12:02 AM
ముచ్చుమర్రి, హంద్రి నీవా ఎత్తిపోతల నుంచి కేసీ కెనాల్‌కు నీరు విడుదల చేయాలని సంబంధిత అధికారులను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ఆదేశించారు.
అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
మండల సమావేశంలో ఎమ్మెల్యే జయసూర్య
నందికొట్కూరు రూరల్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ముచ్చుమర్రి, హంద్రి నీవా ఎత్తిపోతల నుంచి కేసీ కెనాల్‌కు నీరు విడుదల చేయాలని సంబంధిత అధికారులను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ఆదేశించారు. మంగళవారం నందికొట్కూరు మండల పరిషత కార్యాలయంలో ఎంపీపీ మురళీ మోహనరెడ్డి అధ్యక్షతన ఎంపీడీవో సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జయసూర్య హాజరై మాట్లాడారు. అధికారులు అందుబాటులో ఉండటం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని, అలాంటి టవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. సమయపాలన పాటించాలని అన్నారు. గ్రామాల్లో ఏఏ సమస్యలు ఉన్నాయో గుర్తించి ప్రజలకు అందుబాటులో ఉండి పరిష్కరించాలన్నారు. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో తాగు నీటి ఎద్దడి తలెత్తకుండా చేసుకోవాలన్నారు. వీధి లైట్ల నిర్వహణ, పారిశుధ్యుంపై దృష్టి సారించాలన్నారు. రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు ఇవ్వడంలో ఎలాంటి పొరపాట్లు జరుగ కుండా సరి చేసి ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు సర్పంచలు ఎంపీటీసీలు పాల్గొన్నారు.