సరెండర్ లీవ్ బిల్లులు విడుదల చేయండి
ABN , Publish Date - Jan 28 , 2026 | 04:38 AM
2022 నుంచి పెండింగ్‌లో ఉన్న సరెండ్ లీవ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని స్కూల్ టీచర్స్ అసోసియేషన్(ఏపీఎస్టీఏ) రాష్ట్ర అధ్యక్ష..
స్కూల్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్
విజయవాడ, జనవరి 27(ఆంధ్రజ్యోతి): 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న సరెండ్ లీవ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని స్కూల్ టీచర్స్ అసోసియేషన్(ఏపీఎస్టీఏ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాడిశెట్టి శ్రీనివాసులు, తమ్మినాన చందనరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా దాచుకున్న బిల్లులు విడుదల చేయకపోవడంతో ఉపాధ్యాయులు, ఉద్యోగులు పిల్లలను ఉన్నత విద్యకు పంపించలేక, ఆడపిల్లలకు పెళ్లి చేయలేక, గృహ నిర్మాణం వంటి కీలకమైన పనులు పూర్తికాక తల్లడిల్లిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అదే విధంగా 2002 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు, స్టాండింగ్ కమిటీలో ఆమోదం పొందిన మెడికల్ బిల్లులకు నిధులు విడుదల చేయాలని వారు కోరారు.