Waqf Board Chairman: సెకండ్ సర్వే వక్ఫ్ ఆస్తులు నమోదు చేయండి
ABN , Publish Date - Jan 09 , 2026 | 04:11 AM
సెకండ్ సర్వే ఆఫ్ వక్ఫ్ ఆస్తులను త్వరితగతిన శతశాతం ఉమీద్ పోర్టల్‌లో నమోదు చేయాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు.
వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్
ఇంటర్నెట్ డెస్క్: సెకండ్ సర్వే ఆఫ్ వక్ఫ్ ఆస్తులను త్వరితగతిన శతశాతం ఉమీద్ పోర్టల్‌లో నమోదు చేయాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల ఇన్‌స్పెక్టర్ ఆడిటర్ ఆఫ్ వక్ఫ్‌లతో గురువారం ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘రాష్ట్రంలో మొదటి సర్వే వక్ఫ్ ఆస్తులను ఉమీద్ పోర్టల్‌లో వందశాతం నమోదు చేశారు. అదేవిధంగా ఐదు నెలల సమయం ఉందని ఆలస్యం చేయకుండా, సెకండ్ సర్వే వక్ఫ్ ఆస్తులను మండలాలవారీగా శతశాతం నమోదు చేయాలి’ అన్నారు. త్వరలో ఏపీ వక్ఫ్ బోర్డు వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నట్లు అజీజ్ తెలిపారు.