Share News

వరి తగ్గించండి .. పండ్ల తోటలు పెంచండి: అచ్చెన్న

ABN , Publish Date - Feb 06 , 2026 | 03:13 AM

అధిక వ్యయంతో కూడిన వరి పంట వేయడాన్ని తగ్గించాలని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ రైతులకు సూచించారు..

వరి తగ్గించండి .. పండ్ల తోటలు పెంచండి: అచ్చెన్న

  • పోలవరం పూర్తి చేస్తామని జగన్‌ హయాంలో తొడగొట్టారు: నిమ్మల

అమరావతి, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): అధిక వ్యయంతో కూడిన వరి పంట వేయడాన్ని తగ్గించాలని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ రైతులకు సూచించారు. సాగునీటి సంఘాల సమావేశంలో మాధవ్‌ మాట్లాడుతూ కేంద్రం పండ్ల తోటల సాగును ప్రోత్సహించేందుకు వీలుగా కిసాన్‌ సమృద్ధి యోజన కింద రైతులకు ఆర్థిక సాయం చేస్తోందన్నారు. రైతులు వరి పంటను తగ్గించి ఉద్యానవన పంటలు వేయడం ద్వారా అధిక లాభాలు పొందే వీలుందని అచ్చెన్నాయుడు సూచించారు. ఖరీఫ్‌ సాగును మే నెల నుంచే చేపట్టాలన్నారు. మంత్రి నిమ్మల మాట్లాడుతూ డయాఫ్రమ్‌ వాల్‌ ఎందుకు కడతారో తెలియకుండా మాట్లాడినవారూ జగన్‌ సర్కారులో నీటిపారుదల మంత్రులైపోయారంటూ సెటైర్లు వేశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకూ వాల్‌ కట్టారన్న వారూ, పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారంటే తొడలు కొట్టినవారూ, బుల్లెట్‌ దిగిందా లేదా? అని డైలాగులు కొట్టినవారూ జగన్‌ మంత్రివర్గంలో పనిచేశారన్నారు. ఈ సందర్భంగా సాగునీటి సంఘాల సభ్యులు ‘అంబటి రాంబాబు’ అంటూ అరిచారు.

Updated Date - Feb 06 , 2026 | 03:13 AM