గంటలోనే బంగారం రికవరీ
ABN , Publish Date - Feb 19 , 2026 | 12:29 AM
బస్సు ప్రయాణం లో మరి చిపోయిన సుమారు రూ.ఆరులక్షల విలు వైన బంగారు ఆభరణా లను ఆదోని వన్‌టౌన్ పోలీసులు కేవలం గం ట వ్యవధిలోనే రికవరీ చేసి బాధితురాలికి అం దజేశారు.
బాధితురాలికి నగలను అప్పగించిన ఆదోని పోలీసులు
సీఐ చంద్రశేఖర్ బృందంపై ప్రశంసల జల్లు
ఆదోని, ఫిబ్రవరి 18 (ఆం ధ్రజ్యోతి): బస్సు ప్రయాణం లో మరి చిపోయిన సుమారు రూ.ఆరులక్షల విలు వైన బంగారు ఆభరణా లను ఆదోని వన్‌టౌన్ పోలీసులు కేవలం గం ట వ్యవధిలోనే రికవరీ చేసి బాధితురాలికి అం దజేశారు. సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు... కౌతాళం గ్రామానికి చెందిన ఒక మహి ళ బుధవారం పనుల నిమిత్తం ఆర్టీసీ బస్సులో ఆదోనికి బయలుదేరారు. పట్టణంలోని విశాల్‌మార్ట్ సమీపంలో బస్సు దిగిన ఆమె హడావుడిలో తన వెంట తెచ్చుకున్న బ్యాగును సీటులోనే మరిచిపోయింది. కొద్దిసేపటి తర్వాత బ్యాగు గుర్తుకు రావడంతో హుటాహుటిన బస్టాండుకు వెళ్లి డ్రైవర్‌ను విచారించగా, బస్సులో వెతికినా బ్యాగు దొరకలేదు. ఆందోళనకు గురైన బాధి తురాలు సాయంత్రం 3:30గంటలకు వన్ టౌన్ సీఐ చంద్రశేఖర్‌ని ఆశ్రయిం చి ఫిర్యాదు చేశారు. అందులో రూ.6 లక్షలు విలువ చేసే 4 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయని వివరించారు. సీఐ వెంటనే హెడ్ కాని స్టేబుల్ బ్రహ్మానందరెడ్డి, కానిస్టేబుల్ సజ్జన్, విజయ్‌కుమార్‌లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి బస్టాండు పరిసరాల్లోని సీసీటీవీ పుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. డ్రైవర్ ఇచ్చిన ప్రాథమిక సమాచారంతోపాటు తమదైన శైలిలో గాలింపు చేపట్టిన పోలీసులు... చివరకు సాయంత్రం 4:30 గంటలకు ఆ బ్యాగును భద్రంగా స్వాధీనం చేసుకున్నారు. పోలీస్‌స్టేషనకు బాధితురాలిని పిలిపించి సీఐ చంద్రశేఖర్ నగలను అందజేశారు. పోయిన బంగారం ఆభరణాలు తిరిగి దక్కడంతో బాధితురాలు కన్నీటి పర్యంతమవుతూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతగా వ్యవహరించిన వన్ టౌన్ పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.