Vaikunta Dwara Darshans: పది రోజుల్లో 7.90 లక్షల మంది..
ABN , Publish Date - Jan 09 , 2026 | 05:49 AM
తిరుమలలో వైకుంఠ ద్వారం ద్వారా రికార్డు స్థాయిలో భక్తులు దర్శనం చేసుకున్నారు. డిసెంబరు 30వ తేదీ నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనాలు...
రికార్డు స్థాయిలో వైకుంఠ ద్వార దర్శనాలు
హుండీ ఆదాయం రూ.36.86 కోట్లు
తిరుమల, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో వైకుంఠ ద్వారం ద్వారా రికార్డు స్థాయిలో భక్తులు దర్శనం చేసుకున్నారు. డిసెంబరు 30వ తేదీ నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పది రోజులకు దాదాపు 7.90 లక్షల మంది దర్శించుకున్నారు. గతేడాది పది రోజుల్లో 6.83 లక్షల మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. కాగా.. ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనాల తొమ్మిది రోజులకు హుండీ ద్వారా రూ.36.86 కోట్లు సమకూరాయి. 2.06 లక్షల మంది తలనీలాలను సమర్పించారు. 37.97 లక్షల లడ్డుల విక్రయాలు జరిగాయి.