సదరం సర్టిఫికెట్లకు ఒక్కరోజే 57,452 దరఖాస్తులు
ABN , Publish Date - Mar 27 , 2026 | 04:57 AM
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు 57,452 మంది సదరం సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని సెకండరీ హెల్త్ డైరెక్టర్ కేబీఎన్ చక్రధర్‌బాబు తెలిపారు.
రికార్డు స్థాయిలో నమోదయ్యాయన్న సెక్రటరీ చక్రధర్‌బాబు
మార్చి 30 నుంచి మే నెలాఖరు వరకూ వీరికి వైకల్య నిర్ధారణ పరీక్షలు
అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు 57,452 మంది సదరం సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని సెకండరీ హెల్త్ డైరెక్టర్ కేబీఎన్ చక్రధర్‌బాబు తెలిపారు. 28 జిల్లాల్లోని 110 ఆసుపత్రుల్లో.. మార్చి 30నుంచి మే నెలాఖరు వరకూ 80,653 మందికి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేసేందుకు స్లాట్ బుకింగ్ కోసం అవకాశం ఇచ్చామన్నారు. ఒక్కరోజులోనే 57,452 మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇది సదరం స్లాట్ బుకింగ్‌లో రికార్డని చెప్పారు. ఇందులో 41 వేల మంది మొదటిసారి దరఖాస్తు చేసుకున్నారన్నారు. మిగిలినవారు వైకల్య నిర్థారణ పరీక్షకు హాజరై.. ఫలితాలపై అప్పీల్ చేసుకున్నారని తెలిపారు. దరఖాస్తు చేసుకున్నవారికి ఈ నెల 30 నుంచి మే నెలాఖరు వరకూ ఎంపిక చేసిన 110 ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.