Share News

అమరావతిలోనే ఆర్‌బీఐ సిబ్బంది నివాసం

ABN , Publish Date - Jun 20 , 2026 | 06:02 AM

అమరావతిలో ఆర్‌బీఐ సిబ్బందికి నివాస గృహ సముదాయం నిర్మించేందుకు ముందడుగు పడింది.

అమరావతిలోనే ఆర్‌బీఐ సిబ్బంది నివాసం

తుళ్లూరు, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): అమరావతిలో ఆర్‌బీఐ సిబ్బందికి నివాస గృహ సముదాయం నిర్మించేందుకు ముందడుగు పడింది. ఆర్‌బీఐ, ఏపీసీఆర్డీఏకి మధ్య శుక్రవారం ల్యాండ్‌ అగ్రిమెంట్‌ పూర్తయ్యింది. సిబ్బందికి అమరావతిలోని ఐనవోలులో 4.04 ఎకరాలలో నివాస గృహాలను నిర్మిస్తారు. ఆ మేరకు ఒప్పంద పత్రాలను ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయ అధికారి వీసీ రూపకు సీఆర్డీఏ ఎస్టేట్స్‌ విభాగ జాయింట్‌ డైరెక్టర్‌ జుబిన్‌ రాయ్‌ అందజేశారు.

Updated Date - Jun 20 , 2026 | 06:03 AM