మహిళల జోలికొస్తే క్షమించం: రాయపాటి శైలజ
ABN , Publish Date - Apr 05 , 2026 | 04:14 AM
పల్నాడు జిల్లా మాచర్లలో ఒంటరి మహిళపై జరిగిన అమానుష ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా మాచర్లలో ఒంటరి మహిళపై జరిగిన అమానుష ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధిత మహిళను ఆమె ఫోన్‌లో పరామర్శించారు. అత్యాచార ఘాతుకానికి పాల్పడిన నిందితుడిని తక్షణమే అరెస్టు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహిళా భద్రత, రక్షణకు సంబంధించిన విషయాల్లో రాజీపడే ప్రసక్తే లేదని, మహిళల జోలికొస్తే ఎంతటి వారైనా సహించేదిలేదని శైలజ అన్నారు.