Share News

సీమకు ఉద్యాన శోభ

ABN , Publish Date - Sep 24 , 2026 | 06:37 AM

రాయలసీమ దశ, దిశ మార్చే హార్టికల్చర్‌ హబ్‌ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించనుంది. మదనపల్లెలో అక్టోబరు 2నసీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ కలిసి ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.

సీమకు ఉద్యాన శోభ
HORTICULTURE

  • 2న రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌కు శంకుస్థాపన

  • మదనపల్లెలో ప్రారంభించనున్న బాబు, నిర్మల

అమరావతి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ దశ, దిశ మార్చే హార్టికల్చర్‌ హబ్‌ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించనుంది. మదనపల్లెలో అక్టోబరు 2నసీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ కలిసి ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ పథకం కింద ఈ ప్రాజెక్టుకు రూ.40 వేల కోట్ల నిధులను వివిధ రూపాల్లో ఇవ్వనుంది. వీటికి తోడు మరో రూ.60 వేల కోట్లు ప్రైవేటు పెట్టుబడుల ద్వారా రానున్నాయి. రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. మదనపల్లెలో జరిగే కార్యక్రమంలో ‘ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌’కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. వ్యవసాయం రంగంలో అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటయ్యే ఈ అగ్రికల్చర్‌ స్కూల్‌ను రిలయన్స్‌ సంస్థ ఏర్పాటు చేస్తోంది.

Updated Date - Sep 24 , 2026 | 06:37 AM