Share News

రాయలపురం అభివృద్ధికి 160 కోట్లు

ABN , Publish Date - Mar 15 , 2026 | 04:45 AM

తిరుపతి జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి మరో ముందడుగు పడింది. ఏడాది క్రితం జీవకోన ముఖచిత్రం మార్చిన ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఈసారి చంద్రగిరి నియోజకవర్గం వైపు అడుగులు వేసింది.

రాయలపురం అభివృద్ధికి 160 కోట్లు

  • మంజూరు చేస్తామన్న ఎమ్మెల్యే నాని, కలెక్టర్‌

చంద్రగిరి, మార్చి 14(ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి మరో ముందడుగు పడింది. ఏడాది క్రితం జీవకోన ముఖచిత్రం మార్చిన ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఈసారి చంద్రగిరి నియోజకవర్గం వైపు అడుగులు వేసింది. ఇందులో భాగంగా ‘అక్షరం అండగా...పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం శనివారం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రాయలపురం పంచాయతీలో నిర్వహించారు. ఎమ్మెల్యే పులివర్తి నాని, కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, జడ్పీ సీఈవో రవికుమార్‌ నాయుడు, ఆర్డీవో రామ్మోహన్‌ తదితరులు హాజరై ప్రజలు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. రాయలపురం పంచాయతీకి అవసరమైన మౌలిక వసతుల కోసం రూ1.60కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే, కలెక్టరు ఆదేశించారు. తాగునీటి సమస్యను సత్వరమే పరిష్కరిస్తామని కలెక్టర్‌ చెబుతూ అందుకు అవసరమైన నిధులు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గత ఏడాది తిరుపతిలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించినప్పుడు తమ నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేయాలని ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని కోరానని ఎమ్మెల్యే నాని గుర్తుచేశారు. సమస్యలు పరిష్కారం అయిన తర్వాత ఇదే వేదికపై అభినందన సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. స్వర్ణ రాయలపురంగా తీర్చిదిద్దేలా సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన ఎమ్మెల్యే, అధికారులకు సభకు అధ్యక్షత వహించిన ‘ఆంధ్రజ్యోతి’ బ్రాంచ్‌ మేనేజర్‌ సురేశ్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Mar 15 , 2026 | 04:46 AM