రాయగడ ‘మహిళా’ ఎక్స్‌ప్రెస్!
ABN , Publish Date - Mar 10 , 2026 | 05:43 AM
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముగింపు సందర్భంగా వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో మొత్తం మహిళా సిబ్బందితోనే విశాఖ నుంచి రాయగడ వరకు...
మహిళా దినోత్సవం స్పెషల్ సర్వీసు
విశాఖపట్నం, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముగింపు సందర్భంగా వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో మొత్తం మహిళా సిబ్బందితోనే విశాఖ నుంచి రాయగడ వరకు గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ (17243) రైలును నడిపారు. సోమవారం ఉదయం విశాఖపట్నంలో డీఆర్‌ఎం లలిత్ బొహ్రా జెండా ఊపి రైలును సాగనంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘వాల్తేరు డివిజన్‌లో మొత్తం 1,600 మంది మహిళలు వివిధ విభాగాల్లో సమర్థంగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు కాకుండా రైళ్లలోను, స్టేషన్లలోను ప్రత్యేకంగా మహిళా భద్రతా దళం ప్రయాణికులకు సేవలు అందిస్తోంది’ అని తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీఆర్‌ఎం శాంతారామ్, తదితరులు పాల్గొన్నారు.