టీటీడీ ఈవోగా రవిచంద్ర బాధ్యతల స్వీకారం
ABN , Publish Date - Mar 07 , 2026 | 05:02 AM
టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో అనిల్‌కుమార్ సింఘాల్‌పై బదిలీవేటు పడిన...
తిరుమల, మార్చి6(ఆంధ్రజ్యోతి): టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో అనిల్‌కుమార్ సింఘాల్‌పై బదిలీవేటు పడిన తర్వాత రవిచంద్రకు టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. కాగా, పూర్తిస్థాయి ఈవోగా నియమిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన క్రమంలో ఆయన శుక్రవారం శ్రీవారి ఆలయంలో ఈవో బాధ్యతలు తీసుకోవడంతో పాటు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్య కార్యదర్శిగా కూడా ప్రమాణస్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్న ఈవో దంపతులకు రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా, అదనపు ఈవో తీర్థప్రసాదాలు అందజేశారు.