రాతిదూలం పోటీలు పల్లె సంస్కృతిని చాటుతాయి
ABN , Publish Date - Feb 08 , 2026 | 11:18 PM
రాతిదూలం పోటీలు పల్లె సంస్కృతిని చాటుతాయని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు.
పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు
తుగ్గలి, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): రాతిదూలం పోటీలు పల్లె సంస్కృతిని చాటుతాయని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. ఆదివారం ముక్కెళ్లలో మస్తానయ్య స్వామి ఉరుసులో భాగంగా రాతిదూలం పోటీలు ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజేతలకు మొదటి నుంచి వరుసగా ఆరు బహుమతులు రూ.50వేలు, రూ.40వేలు, రూ.30వేలు, రూ.20వేలు, రూ.10వేలు, రూ.5వేలు నగదును దాతల సహకారంతో అందజేస్తున్నట్లు తెలిపారు. పోటీల్లో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి పది జతల ఎద్దులు పాల్గొన్నాయన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు వైవీ ప్రభాకర్ రెడ్డి, సర్పంచ సుజాత, రామచంద్ర, బాలు, రంగనాయకులు చంద్ర, బొజ్జన్న, మునిస్వామి పాల్గొన్నారు.
క్రికెట్ విజేత పత్తికొండ టీవీఎస్ జట్టు
పత్తికొండ: పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తిరునాళ్లను పురస్కరించుకుని పత్తికొండలో నిర్వహిస్తున్న కేఈమాదన్న సౌతఇండియన లెవెల్ క్రికెట్ ట్రోఫీ విజేతగా పత్తికొండ టీవీఎస్ టీం నిలిచింది. ఆదివారం పత్తికొండ టీవీఎస్ వర్సెస్ పత్తికొండ కొవాంటిక్ టీంలు ఫైనల్‌మ్యాచలో తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన మ్యాచలో పత్తికొండ టీవీఎస్ విజేతగా నిలిచింది. ఈసందర్భంగా ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మాట్లాడుతూ క్రీడాకారులకు నిలయమైన పత్తికొండలో సౌత ఇండియాలెవెల్ పోటీలు నిర్వహిస్తే స్థానిక యువక్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్న ఆలోచనతో ఈ ట్రోఫీని నిర్వహించామన్నారు. అనంతరం విజేత టీంకు రూ.2లక్షలు, రన్నర్స్ పత్తికొండ కొవాంటిక్‌టీంకు రూ.లక్ష, మూడవవిజేత బెంగళూర్ రైల్వే్‌సటీంకు రూ.50వేలు, నాలుగవవిజేత బళ్లారి11 టీంకు రూ. 25వేలు చొప్పున నగదుబహుమతులు అందించారు.
హార్టికల్చర్ హబ్‌గా మారుస్తా
పత్తికొండ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే శ్యాం బాబు తెలిపారు. ఆదివారం మండలంలోని పందికోన గ్రామం లో రూ. మూడు కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పందికోన గ్రామంలో రూ.1.80కోట్లతో ప్రాఽథమికోన్నతపాఠశాల నిర్మించామని, పాఠశాలకు అవసరమైన సీసీ రహదారిని త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పని చేస్తున్న పార్టీకే మద్దతుగా నిలువాలని కోరారు. సమావేశంలో సర్పంచ పాలెగార్ మంజుల, నాయకులు సాంబశివారెడ్డి, ప్రమోద్‌కుమార్‌రెడ్డి, కడవల సుధాకర్, చెన్నంనాయుడు, కార్యకర్తలు పాల్గొన్నారు.