Share News

ఉత్తరాంధ్రలో రూ.56 వేల కోట్లతో స్టీల్‌ ప్లాంట్‌!

ABN , Publish Date - Mar 06 , 2026 | 04:55 AM

ఉత్తరాంధ్రలో భారీ పరిశ్రమలు స్థాపించేందుకు ప్రఖ్యాత సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెల్లార్‌ మిట్టల్‌ యేటా 7.3 మిలియన్‌ టన్నుల...

ఉత్తరాంధ్రలో రూ.56 వేల కోట్లతో స్టీల్‌ ప్లాంట్‌!

  • పరిశ్రమల శాఖకు రష్మీ గ్రూప్‌ ప్రతిపాదన

అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో భారీ పరిశ్రమలు స్థాపించేందుకు ప్రఖ్యాత సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెల్లార్‌ మిట్టల్‌ యేటా 7.3 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్‌ ప్లాంటు నిర్మించేందుకు ఇప్పటికే ముందుకు వచ్చింది. దీనికి అవసరమైన 2200 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. తాజాగా రూ.56 వేల కోట్లతో ఏటా 8 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామంటూ కోల్‌కతాకు చెందిన రష్మీ గ్రూప్‌ ప్రతిపాదించింది. దీనిపై పరిశ్రమల శాఖ సానుకూలంగా స్పందించింది. రష్మీ ప్రతినిధులు పరిశ్రమల శాఖ అధికారులతో కలసి ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యటించారు. త్వరలోనే స్టీల్‌ప్లాంట్‌ ఎక్కడ పెడతారో చెబుతారని ప్రభుత్వ వర్గాలు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపాయి.

Updated Date - Mar 06 , 2026 | 04:55 AM