Araku Hospital: మహిళ కడుపులో 9.5 కిలోల కణితి తొలగింపు
ABN , Publish Date - Jan 20 , 2026 | 04:20 AM
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రిలో ఒక గిరిజన మహిళకు సోమవారం అరుదైన శస్త్రచికిత్స చేసి 9.5 కిలోల కణితిని తొలగించారు.
అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స
అరకులోయ, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రిలో ఒక గిరిజన మహిళకు సోమవారం అరుదైన శస్త్రచికిత్స చేసి 9.5 కిలోల కణితిని తొలగించారు. అరకులోయ మండలం మొర్రిగుడ గ్రామానికి చెందిన వంతల లచ్చు (40) రెండేళ్లుగా పొత్తి కడుపులో నొప్పితో బాధపడుతోంది. కాగా ఉదరభాగం పొంగి పోవడంతో ఈ నెల 16న అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి వచ్చింది. సూపరింటెండెంట్, జనరల్ సర్జన్ డాక్టర్ లగుడు రాము పరీక్షలు నిర్వహించి, కణితి ఉన్నట్టు గుర్తించారు. ఎనస్థీషియన్ డాక్టర్ అప్పారావు, డాక్టర్ గీతతో కలిసి సోమవారం ఆ మహిళకు శస్త్ర చికిత్స చేసి 9.5 కిలోల కణితిని తొలగించారు. వాస్తవానికి ఇటువంటి అరుదైన కేసును విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తుంటారు. అయితే ఇక్కడే విజయవంతంగా శస్త్ర చికిత్స చేయడం గమనార్హం.