Share News

విశాఖ తీరంలో అరుదైన చేపలు

ABN , Publish Date - Mar 15 , 2026 | 04:30 AM

విశాఖ మత్స్యకారుల వలకు శనివారం సముద్రంలో రెండు అరుదైన చేపలు చిక్కాయి. వీటిలో ఒకటి టేకు చేప (స్పాటెడ్‌ ఈగల్‌ రే) కాగా,

విశాఖ తీరంలో అరుదైన చేపలు

సాగర్‌నగర్‌ (విశాఖపట్నం), మార్చి 14 (ఆంధ్రజ్యోతి): విశాఖ మత్స్యకారుల వలకు శనివారం సముద్రంలో రెండు అరుదైన చేపలు చిక్కాయి. వీటిలో ఒకటి టేకు చేప (స్పాటెడ్‌ ఈగల్‌ రే) కాగా, మరొకటి మూడు ముళ్ల భవిరి చేప (ట్రిపోడ్‌ ఫిష్‌, ట్రిగ్గర్‌ ఫిష్‌). టేకు చేప శరీరంపై తెల్లని చుక్కలతో రెండు నుంచి మూడు అడుగుల పొడవాటి తోకతో గాలిపటం మాదిరి ఉంటుంది. శరీరంపై మూడు పొడవైన ముళ్లు, పొడవాటి మూతి కలిగి ఉండడం భవిరి చేప ప్రత్యేకత. ఈ రెండు రకాల చేపలు సముద్రం లోపల సంచరిస్తుంటాయి. తీర ప్రాంతంలో చాలా అరుదుగా కనిపించే ఈ చేపలను స్థానికులు, పర్యాటకులు ఆసక్తిగా తిలకించారు. వీటిని ఎవరూ తినరు.

Updated Date - Mar 15 , 2026 | 04:30 AM