అరుదైన ఖనిజాల కారిడార్ శుభపరిణామం
ABN , Publish Date - Feb 02 , 2026 | 06:11 AM
భవిష్యత్తు అవసరాలకు ఎంతో కీలకమైన అరుదైన ఖనిజాల కారిడార్‌ను ఏపీకి కేటాయించడం శుభపరిణామమని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీనేత లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్‌పై టీడీపీ ఎంపీల హర్షం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): భవిష్యత్తు అవసరాలకు ఎంతో కీలకమైన అరుదైన ఖనిజాల కారిడార్‌ను ఏపీకి కేటాయించడం శుభపరిణామమని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీనేత లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో భారీ ఎత్తున ఉపాధి కల్పన జరుగుతుందన్నారు. కేంద్ర బడ్జెట్‌పై ఆదివారం ఢిల్లీలోని ఏపీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీలో గత 10-15 ఏళ్లుగా స్వల్పస్థాయిలో అరుదైన ఖనిజాల తవ్వకాలు జరుగుతున్నాయని, కేంద్రం తాజా ప్రకటనతో ఆ తవ్వకాలు ఊపందుకుటాయని చెప్పారు. రాష్ట్రంలో అరుదైన ఖనిజాలున్న పదిపన్నెండు ప్రాంతాలను గుర్తించారని, వాటిలో మూడింటికి వేలం ప్రక్రియ పూర్తి చేశారని తెలిపారు. మెడికల్ కళాశాలల విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పీపీపీ మోడల్‌ను కేంద్రం స్ఫూర్తిగా తీసుకుందని, పీపీపీ మోడ్‌లో మెడికల్ హబ్‌లు ఏర్పాటు చేస్తామని బడ్జెట్‌లో ప్రకటించిందని చెప్పారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు బురద చల్లడం మానుకోవాలని హితవు పలికారు. మెడికల్ హబ్‌లలో సింహభాగం ఏపీకి వస్తాయన్నారు. బడ్జెట్‌లో ప్రకటించిన ఐదు మెగా టైక్స్‌టైల్స్ హబ్‌లలో ఒకటి ఏపీకి వస్తుందని, దానివల్ల యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.