Share News

చెరువులో బంగారు తీగ

ABN , Publish Date - Jun 07 , 2026 | 05:39 AM

చెరువులో వలేస్తే.. బంగారు తీగ దొరికింది. పైగా ఆరు కిలోల బరువుంది. ఇంకేముంది వలేసిన వారు దానిని ఇంటికి తీసుకెళ్లిపోయారు.

చెరువులో బంగారు తీగ

ఇంటర్నెట్ డెస్క్: చెరువులో వలేస్తే.. బంగారు తీగ దొరికింది. పైగా ఆరు కిలోల బరువుంది. ఇంకేముంది వలేసిన వారు దానిని ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఓహో వారి జీవితమే మారిపోయుంది అనుకుంటున్నారా? ఒక్క నిమిషం. ఆ మత్స్యకారుల వలలో పడింది బంగారుతీగ (కామన్‌ కార్ఫ్‌) అని పిలిచే అక్వేరియం చేప. శనివారం ఏలూరు జిల్లా పోలవరం పంచాయతీ కార్యాలయానికి సమీపంలో ఉన్న చుట్టుగుంట చెరువులో ఆ చేప చిక్కింది. బంగారు వర్ణంలో తళతళ మెరిసిపోతున్న ఈ చేపను గ్రామస్థులు ఆసక్తిగా తిలకించారు. సాధారణంగా ఈ రకం చేపలు కేజీ నుంచి కేజీన్నర బరువు మాత్రమే ఉంటాయి. కొందరు సుమారు రూ. 5 వేల వరకు ధర చెల్లించేందుకు ఆసక్తి చూపినా మత్స్యకారులు ఎవరికీ అమ్మకుండా ఇంటికి తీసుకెళ్లారు. దీని వయసు సుమారు మూడేళ్లు ఉంటుందని, జపాన్‌, చైనా దేశాల్లో దీనిని అదృష్టానికి గుర్తుగా భావిస్తారని మత్స్యశాఖ అధికారి కె.మంగారావు తెలిపారు.

- పోలవరం,ఆంధ్రజ్యోతి

Updated Date - Jun 07 , 2026 | 05:40 AM