Share News

రంజాన్‌ సెలవు రేపు

ABN , Publish Date - Mar 20 , 2026 | 04:46 AM

దేశంలో గురువారం నెలవంక కనిపించకపోవడంతో శుక్రవారం కూడా రంజాన్‌ ఉపవాస దీక్షలు కొనసాగనున్నాయి.

రంజాన్‌ సెలవు రేపు

  • నేడు యథావిధిగా ఆఫీసులు, స్కూళ్లు

  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

  • రేపటి టెన్త్‌ పరీక్ష ఏప్రిల్‌ 2కు వాయిదా

అమరావతి, మార్చి 19(ఆంధ్రజ్యోతి): దేశంలో గురువారం నెలవంక కనిపించకపోవడంతో శుక్రవారం కూడా రంజాన్‌ ఉపవాస దీక్షలు కొనసాగనున్నాయి. ఈద్‌-ఉల్‌-ఫితర్‌ పండుగను శనివారం (21న) జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 20న ప్రకటించిన సెలవు దినాన్ని 21కి మారుస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శుక్రవారం ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, విద్యాసంస్థలు యథావిధిగా పనిచేయనున్నాయి. కాగా, రంజాన్‌ సెలవు మారడంతో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ మారింది. మార్చి 21న జరగాల్సిన ఇంగ్లిష్‌ పరీక్షను ఏప్రిల్‌ 2వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది.

Updated Date - Mar 20 , 2026 | 04:49 AM