వైసీపీ వాకౌట్ దారుణం: రామ్మోహన్ నాయుడు
ABN , Publish Date - Apr 02 , 2026 | 05:03 AM
అమరావతికి చట్టబద్ధత కల్పించడం ద్వారా రాష్ట్ర భవిష్యత్తుకు భరోసా లభించిందని కేంద్ర పౌరవిమానయాన మంత్రి కింజరాపు..
శ్రీకాకుళం, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): అమరావతికి చట్టబద్ధత కల్పించడం ద్వారా రాష్ట్ర భవిష్యత్తుకు భరోసా లభించిందని కేంద్ర పౌరవిమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది రాజధాని కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరి శ్రమకు లభించిన ఫలితమని కొనియాడారు. వారందరికీ ఈ విజయం అంకితమని తెలిపారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేలా పూర్తి సహకారం, తోడ్పాటు అందిస్తున్న ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. బిల్లుకు మద్దతు తెలపకుండా వైసీపీ ఎంపీలు వాకౌట్ చేయడం దారుణమని, ఇది వారి విధ్వంసకర వైఖరికి నిదర్శనమని విమర్శించారు. కేంద్రం మద్దతుతో అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని అవుతుందన్నారు.