పాతకక్షలతోనే రమేశ హత్య
ABN , Publish Date - Feb 04 , 2026 | 11:10 PM
గ్రామంలోని పాతకక్షల నేపథ్యంలోనే ఎమ్మార్పీఎస్ రాష్ట్రవర్కింగ్ ప్రెసిడెంట్ టీఎం రమేశ హత్య జరిగిందని డీఎస్పీ వెంకట్రామయ్య అన్నారు.
పథకం ట్రాక్టర్‌తో గుద్ది రాళ్లు, రాడ్లతో దాడి
రాతనచెరువు వద్ద 12మంది నిందితులు అరెస్టు అరెస్ట్
డీఎస్పీ వెంకట్రామయ్య
పత్తికొండ, ఫిబ్రవరి 4 (ఆంఽధ్రజ్యోతి): గ్రామంలోని పాతకక్షల నేపథ్యంలోనే ఎమ్మార్పీఎస్ రాష్ట్రవర్కింగ్ ప్రెసిడెంట్ టీఎం రమేశ హత్య జరిగిందని డీఎస్పీ వెంకట్రామయ్య అన్నారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో సీఐ పులిశేఖర్, ఎస్‌ఐ మల్లికార్జునతో కలిసి రమేశ హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామానికి చెందిన రమేశ జనవరి 30వ తేదీ నునుసు రాళ్ల గ్రామంవైపు ఒంటరిగా వాకింగ్‌కు వెళ్లాడు. గ్రామానికి చెందిన షేక్ సుభాన వలితో పాటు మరో11మంది అతడిని వెంబండించారు. ట్రాక్టర్‌తో గుద్దడంతో పక్కనే ఉన్న గుంతలోకి రమేశ పడిపోయాడు. వెంటనే రాళ్లు, రాడ్లతో దాడి చేశారు. అదేసమయంలో బొందిమడుగులకి చెందిన వడ్దేరంగస్వామి, కత్తిరి ఆచారి రంగస్వామి అటుగా రావడం కేకలు వేశారు. దీంతో నిందితులు ట్రాక్టర్‌తో సహా అక్కడి నుంచి పారిపోయారు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి రమేశ కుటుంబ సభ్యులు చేరుకున్నారు. హుటాహుటిన కర్నూలు మౌర్య ఆస్పత్రికి తరలించారు. తుగ్గలి ఇనచార్జి ఎస్‌ఐ మల్లికార్జున కర్నూలుకు వెళ్లి రమేశతో పాటు కుటుంబ సభ్యులతో వివరాలు సేకరించారు. తనపై జరిగిన దాడి వివరాలను ఆస్పత్రిలో రమేష్ వాంగ్మూలం ఇచ్చారు.చికిత్స పొందుతూ కోలుకోలేక గత శనివారం రమేశ మరణించారు. దాడికేసును ఎస్‌ఐ మల్లికార్జున హత్యకేసుగా నమోదు చేశారు. హత్యచేసిన నిందితుల్లో ఒకరు ఓయువతిని వేధిస్తుండటంతో ఆ యువతి కుటుంబం రమేశను ఆశ్రయించారు. యువతి పక్షాన నిలిచిన రమేశ అండగో కుటుంబసభ్యులు ఆ వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. దీంతో రమేశపై అతడు కక్ష పెంచుకున్నాడు. గ్రామానికిచెందిన గొల్లసరోజమ్మ స్థలంలో నిందితులు గోడకట్టడంతో పంచాయితీ చేసి సగం స్థలం సరోజమ్మకు ఇప్పించాడు. దాడికి ఒకరోజు ముందు బొందిమడుగుల మజారా గ్రామమైన లింగనేనిదొడ్డిలో నిందితుల్లో ఒకడైన ముస్లిం వ్యక్తికి, ఎస్సీ వ్యక్తికి మధ్య ఉన్న పొలంతగాదాలో ఎస్సీ వ్యక్తికి రెండెకరాలు వస్తుందని కొలతలు వేయించాడు.
పై మూడు ఘటనల నేపథ్యంలో
ఈ మూడు ఘటనల నేపథ్యంలో తమ ఎదుగుదలకు అడ్డువస్తున్నాడని రమేశ ను అంతమొందిస్తేతప్ప తమ మనుగడ కష్టమని షేక్ సుభానవలి కుటుంబంతో పాటు లింగనేని దొడ్డికి చెందిన మౌలాలి కక్ష పెంచుకుని రమేశను హత్యచేసేందుకు పథకం వేసుకున్నారు. వాకింగ్‌కు వెళ్తున్న అతడిని ట్రాక్టర్‌తో గుద్ది, రాళ్లు, రాడ్లతో దాడిచేసి హత్యచేశారు. ఈహత్యకేసుకు సంబంధించి 12మంది నిందితులను బుధవారం తుగ్గలిమండలం రాతన చెరువువద్ద అరెస్టు చేశారు. చందోలిక్రాస్‌వద్ద మొరిలో దాచిన హత్యకు ఉపయోగించిన రెండు రాడ్లు స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిలను పత్తికొండ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తామని డీఎస్పీ తెలిపారు.
పరువు నష్టం దావావేస్తా
రమేశ హత్యకు సంబంధించి డీఎస్పీ హస్తం ఉందని కొందరు తప్పుడు ఆరోపణలకు దిగుతున్నారని, అలాంటి వ్యక్తులపై పరవునష్టం దావా వేస్తానని డీఎస్పీ వెంకట్రామయ్య అన్నారు. మృతుడు రమేశ తనకు 18సంవత్సరాలు తెలుసునని అన్నారు. కొందరు అరకొర సమాచారంతో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వారిపై త్వరలో చట్టపరంగా చర్యలు తీసుకుంటానన్నారు.