Share News

ప్రైవేటు కాలేజీల జేఏసీ కన్వీనర్‌గా రమణాజీ

ABN , Publish Date - Jan 30 , 2026 | 04:53 AM

సమస్యల పరిష్కారం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల కోసం రాష్ట్రంలోని అన్ని రకాల ప్రైవేటు విద్యా సంస్థలు కలిసి జేఏసీగా ఏర్పడ్డాయి.

ప్రైవేటు కాలేజీల జేఏసీ కన్వీనర్‌గా రమణాజీ

అమరావతి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల కోసం రాష్ట్రంలోని అన్ని రకాల ప్రైవేటు విద్యా సంస్థలు కలిసి జేఏసీగా ఏర్పడ్డాయి. గురువారం మంగళగిరిలో నిర్వహించిన సమావేశం దీనికి వేదికైంది. ఇందులో జూనియర్‌ కాలేజీలు, ఐటీఐలు, పాలిటెక్నిక్‌, ఫార్మసీ, బీఈడీ కాలేజీలు, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, నర్సింగ్‌, పీజీ కోర్సులు అందించే విద్యా సంస్థలు ఉన్నాయి. ఇంజనీరింగ్‌ కాలేజీలు మాత్రమే ఇందులో చేరలేదు. జేఏసీ కన్వీనర్‌గా జె.రమణాజీ, సభ్యులుగా పొన్న జయరాం, కె.శ్రీనివాసరావు, ఎన్‌.శ్రీనివాస మోహన్‌, బి.శ్రీనివాసరావు, వి.జనార్ధన్‌, జి.మొహిద్దీన్‌, వి.విజయరమణ, వీవీ ప్రసాద్‌, వైవీఎ్‌సఎన్‌ ప్రసాద్‌ ఎన్నికయ్యారు. దాదాపు తొమ్మిది విడతల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, మూడేళ్ల మెయింటెనెన్స్‌ ఫీజులు బకాయి ఉన్నాయని జేఏసీ తెలిపింది. దీంతో సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని పేర్కొంది. ఫిబ్రవరి 10లోపు ఫీజులు విడుదల చేయాలని కోరింది.

Updated Date - Jan 30 , 2026 | 04:53 AM