హోరాహోరీగా పొట్టేళ్ల పందెం
ABN , Publish Date - May 02 , 2026 | 10:56 PM
మండలంలోని ముడుమలగుర్తిలో పొట్టేళ్ల పందెం హోరాహోరీగా జరిగింది. నవరత్నాల నరసింహస్వామి తిరునాళ్లు సందర్భంగా శనివారం పొట్టేళ్ల పందెం నిర్వహించారు.
కోడుమూరు రూరల్, మే 2(ఆంధ్రజ్యోతి): మండలంలోని ముడుమలగుర్తిలో పొట్టేళ్ల పందెం హోరాహోరీగా జరిగింది. నవరత్నాల నరసింహస్వామి తిరునాళ్లు సందర్భంగా శనివారం పొట్టేళ్ల పందెం నిర్వహించారు. ఈ పోటీకి వివిధ చోట్ల నుంచి సుమారు 14 పొట్టేళ్లు పాల్గొన్నాయి. డోనకు చెందిన కిరాయి గుండా పొట్టేలు ప్రథమ స్థానంలో నిలిచి రూ. 15 వేలు గెలుపొందింది. ముడుమలగుర్తికి చెందిన బైరాగి, ఎర్రబాడు రాయల్ గ్రూప్ కాంతారా పొట్టేళ్లు తర్వాతి స్థానాల్లో నిలిచి రూ. 10 వేలు, రూ. 5 వేలు కైవసం చేసుకున్నాయి. విజేతలకు దాత శ్రీధర్‌రెడ్డి నగదు బహుమతులు అందజేశారు. ఈ పోటీలను తిలకించడానికి ప్రజలు పెద్దఎత్తున విచ్చేశారు. కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, రంగన్నస్వామి, సుధాకర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, శివ, మనోహర్, లింగన్న, కోట్ల ప్రతాప్, చాకలి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.