Share News

ప్రధాని ఆప్యాయతకు కృతజ్ఞులం: రామ్మోహన్‌

ABN , Publish Date - May 24 , 2026 | 04:26 AM

‘ప్రధాని చూపిన ప్రేమ, ఆప్యాయత, ఆశీస్సులకు మేమెప్పటికీ కృతజ్ఞులమే. మాతో గడిపిన అమూల్యమైన సమయానికి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు’ అని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు.

ప్రధాని ఆప్యాయతకు కృతజ్ఞులం: రామ్మోహన్‌

  • కుటుంబ సభ్యులతో మోదీని కలసిన కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ, మే 23(ఆంధ్రజ్యోతి): ‘ప్రధాని చూపిన ప్రేమ, ఆప్యాయత, ఆశీస్సులకు మేమెప్పటికీ కృతజ్ఞులమే. మాతో గడిపిన అమూల్యమైన సమయానికి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు’ అని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. అమ్మ, భార్య, పిల్లలతో కలసి శనివారం మోదీని లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన తల్లి పీఎంకు మొక్కను బహూకరించారు. ‘ఈ రోజు మా కుటుంబానికి జీవితాంతం గుర్తుండిపోయే ఓ భావోద్వేగ క్షణం. ప్రధానిని కుటుంబ సమేతంగా కలిసే అదృష్టం కలగడం ఎంతో ఆనందంగా, గర్వంగా భావిస్తున్నాను. ప్రధాని అసాధారణ వ్యక్తిత్వం, ఆప్యాయత మా కుటుంబంలోని మూడు తరాలను ఒకేలా ఆకట్టుకుంది. ప్రజల హృదయాల్లో ఆయన ఎందుకు అపారమైన ఆదరణ పొందారో ఆ క్షణంలో మరింత స్పష్టంగా తెలిసింది. ప్రత్యేకంగా... ‘అమ్మ పేరుతో మొక్క’ అనే మహత్తర ఆలోచనకు ప్రేరణగా మా తల్లి మొక్కను బహూకరించడం మా కుటుంబానికి ఎంతో మధురమైన, గర్వకారణమైన క్షణంగా నిలిచిపోతుంది’’ అని కేంద్ర మంత్రి ఎక్స్‌లో పేర్కొన్నారు.

Updated Date - May 24 , 2026 | 04:27 AM