విద్యుత్ ఉపకేంద్రానికి 7 కోట్ల స్థలం విరాళం
ABN , Publish Date - Aug 20 , 2026 | 04:18 AM
రాజమహేంద్రవరం రూర ల్ మండలం హుకుంపేటకు చెందిన దివంగత సత్యవోలు పాపారావు చిన్న కోడలు డాక్టర్ వడ్డాది గౌరి దాతృత్వానికి..
దాతృత్వం ప్రదర్శించిన డాక్టర్ గౌరి
రాజమహేంద్రవరం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం రూర ల్ మండలం హుకుంపేటకు చెందిన దివంగత సత్యవోలు పాపారావు చిన్న కోడలు డాక్టర్ వడ్డాది గౌరి దాతృత్వానికి నిదర్శనం గా నిలిచారు. స్థానిక హుకుంపేటలో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి రూ.7 కోట్ల విలువైన 2,400 చదరపు గజాల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. ఆమె దాతృత్వానికి ఏపీఈపీడీసీఎల్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. ఈ భూమికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్న సందర్భంగా డీఈఈ శామ్యూల్ ఆమె దాతృత్వానికి ధన్యవాదాలు తెలిపారు.