కాలుమీద కాలేసుకుని.. కాలర్ ఎగరేస్తూ..
ABN , Publish Date - Apr 07 , 2026 | 05:47 AM
జైలుకు వెళితే ఎవరైనా అవవమానంగా భావిస్తారు..! తన కుటుంబం పట్ల ఈ సమాజం చిన్నచూపు చూస్తుందని ఫీలవుతారు..! కానీ.. చీటింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా...
సెంట్రల్ జైల్ మై కంట్రోల్.. అంటూ పోస్టులు
వైరల్ అవుతున్న రిమాండ్ ఖైదీ ఫొటోలు
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): జైలుకు వెళితే ఎవరైనా అవవమానంగా భావిస్తారు..! తన కుటుంబం పట్ల ఈ సమాజం చిన్నచూపు చూస్తుందని ఫీలవుతారు..! కానీ.. చీటింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా జైలుకెళ్లిన ఓ 32 ఏళ్ల యువకుడు మాత్రం.. ఏదో ఘనకార్యం సాధించినట్టు భావించాడు. కాలర్ పైకి ఎగరేసి, కాలుమీద కాలేసుకుని కూర్చున్న ఫొటోను.. సెంట్రల్ జైలుపై కూర్చున్నట్టుగా ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. ‘ఈ సెంట్రల్ జైలు నా అడ్డా.. ఇదంతా ఇప్పుడు నా కంట్రోల్‌లోనే ఉంది’ అనేలా పెట్టిన ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజమహేంద్రవరం మున్సిపల్ కాలనీకి చెందిన 32 ఏళ్ల అల్లాడ శ్రీకాంత్.. ఎల్‌ఎల్‌ఎం చదివాడు. బెయిల్ ఇప్పిస్తానని కొందరిని మోసగించడం, ఇతర అభియోగాలపై అతనిపై త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలతో ప్రస్తుతం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.