డ్రైవర్‌హత్య కేసులో లక్ష్మీదుర్గ పిటిషన్‌పై రేపు నిర్ణయం
ABN , Publish Date - Apr 14 , 2026 | 06:30 AM
దళిత డ్రైవరు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు నుంచి తన పేరు తొలగించాలని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ దాఖలుచేసిన పిటిషన్‌పై కోర్టు బుధవారం తన నిర్ణయం వెలువరించనుంది.
ఉమ్మడి తూర్పు జిల్లా కోర్టు వెల్లడి
కేసులో తన పేరు తొలగించాలని ఎమ్మెల్సీ అనంతబాబు భార్య వ్యాజ్యం
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): దళిత డ్రైవరు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు నుంచి తన పేరు తొలగించాలని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ దాఖలుచేసిన పిటిషన్‌పై కోర్టు బుధవారం తన నిర్ణయం వెలువరించనుంది. ఈ కేసుతో తనకు సంబంధం లేదని.. అందువల్ల తనను ఇందులో నుంచి తప్పించాలని ఆమె వేసిన వ్యాజ్యంపై సోమవారం రాజమహేంద్రవరంలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోర్టులో విచారణ జరిగింది. భార్యాభర్తలిద్దరూ కలిసే నేరం చేశారని ప్రాసిక్యూషన్ తరపున సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు తెలిపారు. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉండగా.. ఏ2గా లక్ష్మీదుర్గను కేసులో చేర్చడం సరికాదని అనంతబాబు తరఫు న్యాయవాది తెలిపారు. వాదనల అనంతరం.. బుధవారం నిర్ణయం వెలువరిస్తామని న్యాయాధికారి గంధం సునీత ఉత్తర్వులిచ్చారు.