Share News

లిక్కర్‌ స్కామ్‌లో రాజ్‌ కసిరెడ్డి ఆస్తుల జప్తు

ABN , Publish Date - Mar 27 , 2026 | 04:59 AM

మద్యం కుంభకోణంలో కింగ్‌పిన్‌ రాజ్‌ కసిరెడ్డికి ఏపీ సీఐడీ మరో షాక్‌ ఇచ్చింది. తెలంగాణలోని జనగామ, షాబాద్‌ ప్రాంతాల్లో తల్లి సుభాషిణి, తండ్రి ఉపేంద్ర రెడ్డి పేరుతో స్థిరాస్తిని కసిరెడ్డి కొనుగోలు చేశాడు.

లిక్కర్‌ స్కామ్‌లో రాజ్‌ కసిరెడ్డి ఆస్తుల జప్తు

అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో కింగ్‌పిన్‌ రాజ్‌ కసిరెడ్డికి ఏపీ సీఐడీ మరో షాక్‌ ఇచ్చింది. తెలంగాణలోని జనగామ, షాబాద్‌ ప్రాంతాల్లో తల్లి సుభాషిణి, తండ్రి ఉపేంద్ర రెడ్డి పేరుతో స్థిరాస్తిని కసిరెడ్డి కొనుగోలు చేశాడు. 2022లో కొంత, 2024లో మరికొంత ఆస్తిని రూ.2.85కోట్లకు కొనుగోలు చేసినట్లు డాక్యుమెంట్లలో చూపించాడు. ఆ ఆస్తిని రూ.70 కోట్లకు కొనుగోలు చేసినట్లు సిట్‌ అధికారులు ఆరా తీస్తే తెలిసింది. మిగతా 67.15 కోట్లు నగదు రూపంలో చెల్లింపులు జరిపినట్లు ఆధారాలు లభించాయి. ఆ నగదు అంతా మద్యం ముడుపుల సొమ్మేనని గుర్తించి, ఆస్తుల జప్తునకు సిట్‌ అధికారులు ప్రభుత్వ అనుమతి కోరారు. ఈమేరకు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్‌ వేసేందుకు సిట్‌కు అనుమతిస్తూ హోంశాఖ జీవో జారీ చేసింది.

Updated Date - Mar 27 , 2026 | 04:59 AM