Share News

నాపై కేసు కొట్టివేయండి హైకోర్టును ఆశ్రయించిన రాజ్‌ కసిరెడ్డి

ABN , Publish Date - Jul 03 , 2026 | 04:22 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం రవాణాలో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలతో తనపై మంగళగిరి సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసును..

నాపై కేసు కొట్టివేయండి హైకోర్టును ఆశ్రయించిన రాజ్‌ కసిరెడ్డి

అమరావతి, జూలై 2(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం రవాణాలో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలతో తనపై మంగళగిరి సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ కసిరెడ్డి రాజశేఖరెడ్డి (రాజ్‌ కసిరెడ్డి) దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హై కోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని సీఐడీని ఆదేశించింది. విచారణను జూలై 9కి వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు.

Updated Date - Jul 03 , 2026 | 04:22 AM