పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం దుర్మార్గం
ABN , Publish Date - May 19 , 2026 | 12:03 AM
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం దుర్మార్గమని ఎమ్మెల్సీ డాక్టర్ మధు సూదన అన్నారు.
ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన
పట్టణంలో నిరసన ర్యాలీ
సబ్‌కలెక్టర్‌కు వినతి పత్రం అందజేత
ఆదోని అగ్రికల్చర్, మే 18 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం దుర్మార్గమని ఎమ్మెల్సీ డాక్టర్ మధు సూదన అన్నారు. పెంచిన పెంట్రోల్ డిజిల్ ధరలను నిరసిస్తూ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఆ ధ్వర్యంలో నిరసన చేపట్టారు. స్థానిక వైసీపీ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఇనచార్జి సబ్ కలెక ్టర్ మధుసూదనరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వైసీ పీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శశికళ, నాయకులు జయ మనోజ్ రెడ్డి, చంద్రకాంత రెడ్డి, దేవా, సన్నీ శ్రీలక్ష్మి, న్యాయవాదులు జీవన సింగ్, తబ్రేజ్, నగరూరు చంద్ర వెంకటేశ్వర్లు ఏసేపు పాల్గొన్నారు.
పత్తికొండటౌన : పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే ఆటోకు తాడు కట్టి లాగుతూ నిరసన తెలియజేశారు. అనంతరం నాలుగు స్తంభాల కూడలిలో జరిగిన ధర్నాలో మాజీ ఎ మ్మెల్యే మాట్లాడారు. ప్రజా పక్షాన రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడ తామ ని హెచ్చరించారు. అనంతరం వినతి పత్రాన్ని ఆర్డీఓ కార్యాలయ అధికారులకు అందించారు. వైసీపీ నాయకులు రంగడు, బాబు ల్‌రెడ్డి, ఎంపీపీ నారాయణదాస్, శీను, తుగ్గలి మోహన్‌రెడ్డి, గిట్టా నగేష్, గాంధీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆలూరు: పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి ప్రజలపై భారం మోపడం సరికాదని వైసీపీ నాయకుడు బుసినే శ్రీరాములు అన్నారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్దకు వైసీపీ నాయులు ర్యాలీ గా వెళ్లి నిరసన తెలియజేశారు. అనంతరం తహసీల్దార్ శోభా సు వర్ణమ్మకు వినతి పత్రం అందించారు. వైసీపీ నాయకులు మల్లికా ర్జున, రామాంజనేయ, అర్ధగేరి శ్రీనివాసులు, ఎస్.కె.గిరి, అరికెర వెంక టేష్, వీరేష్, చిన్న ఈరన్న, కొట్టాల రాజు, ఉరుకుందు పాల్గొన్నారు.