డిప్యూటీ సీఎంకో న్యాయం.. నాకో న్యాయమా?
ABN , Publish Date - Jul 02 , 2026 | 04:01 AM
రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తాను రాజ్యాంగంలోని అంశాలను ప్రస్తావిస్తే ‘నాలుక కోస్తాం.. సమాధి కడతాం..’ అంటూ వ్యాఖ్యలు చేసిన వారిపై...
నా నాలుక కోస్తా అన్న వారిపై చర్యలేవీ?: డిప్యూటీ స్పీకర్ రఘురామ
కాళ్ల, జూలై 1(ఆంధ్రజ్యోతి): రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తాను రాజ్యాంగంలోని అంశాలను ప్రస్తావిస్తే ‘నాలుక కోస్తాం.. సమాధి కడతాం..’ అంటూ వ్యాఖ్యలు చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను దుర్భాషలాడిన ‘ప్రశ్న’ యూట్యూబర్ ‘రావణ్’పై కొందరు అభిమానులు ఫిర్యాదు చేశారు. ఈరోజు ఆయనను అరెస్ట్ చేసినట్లు అదే సోషల్ మీడియాలో చూశా. ఏలూరులో జరిగిన బహిరంగ సభలో జడ శ్రవణ్‌కుమార్ నాపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కాళ్ల, ఏలూరు ప్రాంతాలకు చెందిన నా అభిమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం మతం మారిన వారికి ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవని ఉంది. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు కూడా వెల్లడించింది. అదే మాట నేను చెబితే ‘నానాలుక కోసి, సమాధి చేస్తా’ అని ఓ వ్యక్తి బరి తెగించి మాట్లాడితే ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోలేద’’న్నారు.