జగన్‌ను ముంచాల్సి వచ్చింది కాబట్టే ముంచా
ABN , Publish Date - Apr 10 , 2026 | 03:30 AM
నన్ను సమర్థిస్తే చంద్రబాబుకు క్రైస్తవుల ఓట్లు పోతాయని, జగన్‌ను ముంచినట్లుగా ముంచుతానని కొంతమంది అంటున్నారు. నాది, చంద్రబాబుది ఫెవికాల్ బంధం.
చంద్రబాబుది.. నాది ఫెవికాల్ బంధం: రఘురామ
కాళ్ల, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): ‘నన్ను సమర్థిస్తే చంద్రబాబుకు క్రైస్తవుల ఓట్లు పోతాయని, జగన్‌ను ముంచినట్లుగా ముంచుతానని కొంతమంది అంటున్నారు. నాది, చంద్రబాబుది ఫెవికాల్ బంధం. నీలి కుమారులకు ఏం పని జరగదు.. జగన్‌ను ముంచాల్సి వచ్చింది కాబట్టే ముంచా ను’ అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పెద అమిరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆకివీడు పెదపేటలో త్వరలో శిల్పకళ ఉట్టిపడేలా రామాలయ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ కార్యాలయాలపై వైసీపీ దాడులను రఘురామ ఖండించారు.