పెదపేట రామాలయానికి మేలో భూమి పూజ: రఘరామ
ABN , Publish Date - Apr 14 , 2026 | 05:38 AM
ఆకివీడు పెదపేట రామాలయానికి వచ్చే నెలలో భూమి పూజ చేస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు.
కాళ్ళ, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): ఆకివీడు పెదపేట రామాలయానికి వచ్చే నెలలో భూమి పూజ చేస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. ‘‘దేశంలో ఎక్కడా దేవాలయాలు కట్టకూడదన్నట్లు క్రైస్తవ సంఘాలు ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నాయి. ఇలాంటి ఆటంకాలు ఆలయాల నిర్మాణాలు జరిగే సందర్భాల్లో సర్వసాధారణం. ఆర్టికల్ 25 ప్రకారం ఎవరికైనా మతం మారే హక్కుంది. కొంత మంది నీలికుమార్‌లు రాజ్యాంగాన్ని వక్రీకరిస్తున్నారు. చర్చిలకు వెళ్లే దళితులకు రిజర్వేషన్ స్థానాల్లో పోటీ చేసే అర్హత లేదు. ఒకవేళ పోటీ చేయాలంటే ఇప్పటి నుంచి చర్చిలకు కాకుండా గుళ్లకు వెళ్లాలి. చర్చికి వెళితే మీ నామినేషన్ కోల్పోయే అవకాశం ఉంది.’’ అన్నారు. ‘‘ప్రజల సహకారంతో రూ.కోటి సమకూరాయి. ఏకాదశి సందర్భంగా శిలలు దిగుమతి చేసే వారికి రూ.9,99,999 అందించాం’’ అని రఘురామ తెలిపారు.